ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో కాంప్లెక్స్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి గుర్తించిన రామోజీ ఫిల్మ్ సిటీ సినిమా నిర్మాణానికి కావాల్సిన అపరమిత మౌలిక సదుపాయాలను, చిత్రీకరణ ఏర్పాట్లను, షూటింగ్ ప్రదేశాలు, ప్రొడక్షన్ వనరులను, ఇతర అనుబంధ సేవలను అన్నివేళలా అందిస్తుంది. ఇప్పటివరకు 2600 పైచిలుకు చిత్రాలను ఇక్కడ నిర్మించారు. అచ్చెరువొందించే వీధులు, నేపథ్య ఆకర్షణలు, స్టూడియో టూర్, పర్యావరణ పర్యటన, పక్షుల కేంద్రం, సీతాకోకచిలుకల ఉద్యానవనం, నిత్యం ఆనందపరచే లైవ్ షోలు, హై-యాక్షన్ స్టంట్స్, ఆటలు, సాహస, సరదా సవారీలు, ఆహారశాలలు, విపణికేంద్రాలు, సౌకర్యవంతమైన హోటల్ మొదలైన సదుపాయాలతో రామోజీ ఫిల్మ్ సిటీ అందర్నీ ఆకర్షించే పర్యాటక కేంద్రంగా కూడా గుర్తింపు పొందింది.